తపాలా విభాగంలో సేవలు అందించడానికి గ్రామీణ డాక్ సేవక్ (జీడీఎస్) ప్రకటన వెలువడింది. పదో తరగతిలో సాధించిన మార్కులతో ఈ నియామకాలు చేపడతారు. ఎంపికైనవారు బ్రాంచ్ పోస్టు మాస్టర్ (బీపీఎం), అసిస్టెంట్ బ్రాంచ్ పోస్టు మాస్టర్ (ఏబీపీఎం), డాక్ సేవక్ హోదాలతో విధులు నిర్వహించవచ్చు. పోస్టును బట్టి రూ.పదివేల నుంచి రూ.పన్నెండు వేల వేతనం అందుకోవచ్చు. ఆసక్తి ఉన్నవారు జూన్ 5 లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
ఆంధ్రప్రదేశ్ 1716, తెలంగాణలో 1226 ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టులకు ఎంపికైన వారు రోజుకు నాలుగు గంటలు పనిచేస్తే సరిపోతుంది. దీనికిగాను బ్రాంచ్ పోస్టు మాస్టర్(బీపీఎం)కు రూ.12 వేలు, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్టు మాస్టర్ (ఏబిపీఎం), డాక్ సేవక్ లకు రూ.10 వేలు చెల్లిస్తారు. వీటితోపాటు ఇండియన్ పోస్టల్ పేమెంట్స్ బ్యాంకుకు సంబంధించిన సేవలకు గానూ ప్రత్యేకంగా ఇన్సెంటివ్ రూపంలో బీపీ ఎం/ఏబీపీఎం/ డాక్ సేవక్లకు ప్రోత్సాహం అందిస్తారు. ఆ సేవల విలువ ప్రకారం ఇంటెన్సివ్ ఆధారపడి ఉంటుంది. వీరు రోజువారీ విధులు నిర్వర్తించడానికి ల్యాప్టాప్/ కంప్యూటర్/స్మార్ట్ఫోన్ లాంటివి తపాలాశాఖ సమకూరుస్తుంది. సంబంధిత కార్యాలయానికి అందుబాటులో నివాసం ఉండాలి. సైకిల్ తొక్కడం రావాలి.
ఎంపిక విధానం :
అభ్యర్థులు పదో తరగతిలో సాధించిన మార్కుల మెరిట్ ప్రకారం నియామకాలు చేపడతారు. ప్రకటనలో ఖాళీలు ఉన్న బ్రాంచీలు, ఏ హోదాలో ఖాళీ ఉంది, రిజర్వ్/ అన్ రిజర్వ్డ్ వివరాలు పేర్కొన్నారు. వాటిని అభ్యర్థులు పరిశీలించి, తమ ప్రాధాన్యం ప్రకారం ఆప్షన్లు ఇచ్చుకోవాలి. మొదటి ప్రాధాన్యం ఇస్తోన్నదానికి ఆప్షన్-1 తర్వాత దానికి ఆప్షన్-2... ఇలా నింపాలి. అవకాశాన్ని బట్టి వీటిలో ఏదో ఒకచోట పోస్టింగ్ కేటాయిస్తారు. ఎంపికైనవారికి సమాచారం ఎస్ఎంఎస్/ ఈమెయిల్/పోస్టు ద్వారా అందుతుంది.
అర్హత: పదో తరగతి ఉత్తీర్ణత సాధించినవారై ఉండాలి. ఇందులో మ్యాథ్స్, ఇంగ్లిష్, స్థానిక భాష ఉండటం తప్పనిసరి. అంటే ఏపీ, తెలంగాణకు చెందిన వారు తెలుగు సబ్జెక్టు పదో తరగతి వరకు చదవడం తప్పనిసరి.
వయసు: జూన్ 5, 2022 నాటికి 18-40 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్లు గరిష్ఠ వయసులో సడలింపు వర్తిస్తుంది.
జీతం ::
BPM (బీపీఎం) :: రూ. 12,000 /-
ABPM / Dak Sevak :: రూ. 10,000 /-
ఫీజు: మహిళలు, దివ్యాంగులు, ట్రాన్స్ జెండర్లు, ఎస్సీ, ఎస్టీలకు లేదు. మిగిలిన అభ్యర్థులు రూ. వంద చెల్లించాలి.
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ :: జూన్ 5వ తేదీ
Official Notification PDF Download Link 👇👇
Vacancies Details PDF Download Link 👇👇
Online Appling Link 👇👇
AP Postal Department New Notification Release For 1716 GDS & BPM Posts
ఈ క్రింద ఇచ్చినటువంటి లింకు లో క్లియర్ గా పిడిఎఫ్ చూడండి. మీరు ఒకవేళ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటే పైన ఉన్న లింక్ ని క్లిక్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోండి.
గమనిక :: పైనున్న ఇన్ఫర్మేషన్ నచ్చినట్లైతే మీ తోటి మిత్రులకు సెట్ చేయగలరు. 🖕🖕