ఆధార్ (UIDAI) కు సంబంధించి ప్రజలు తమ ఆధార్ అప్డేట్ హిస్టరీని అధికార వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో చెక్ చేసుకునేందుకు నిబంధనలను రూపొందించడం జరిగింది. ఈ ప్రత్యేక ఫీచర్ వినియోగదారులకు తమ ఆధార్ వివరాల అప్డేట్ హిస్టరీని చెక్ చేసుకోవడానికి అనుమతిస్తుంది. నివాసితులు తమ చిరునామా, మొబైల్ నెంబర్, ఇమెయిల్ చిరునామా, మొదలైన వాటిని మార్చినప్పుడల్లా వారి ఆధార్ కార్డు వివరాలలో అప్డేట్ కోసం వెబ్సైట్లో తెలుసుకోవచ్చును. ఈ అప్డేట్ అభ్యర్థనలన్నీ UIDAI డేటా బేస్ లలో వేరువేరు URN ల క్రింద ఉంచడం జరిగింది. జనాభా మరియు బయోమెట్రిక్ వివరాలు ఆన్లైన్ లేదా ఆఫ్లైన్లో అప్డేట్ చేయవచ్చు, అయితే వారి ఆధార్ అప్డేట్ హిస్టరీ ఆన్లైన్ లో మాత్రమే చెక్ చేయవచ్చు.
How to Check Aadhar Update History Online
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ సంక్షేమ పథకం అప్లై చేయాలన్న తప్పనిసరిగా ఆధార్ అప్డేట్ హిస్టరీ ఉండాలి. ఈ అప్డేట్ హిస్టరీని ఆధారంగానే సంక్షేమ పథకాలు అప్లై చేయడం జరుగుతుంది.(alert-passed)
UIDAI వెబ్సైట్ ను సందర్శించడం ద్వారా ఆధార్ అప్డేట్ ఆధార్ హిస్టరీని ఆన్లైన్లో చెక్ చేయవచ్చు. ఈ సదుపాయాన్ని పొందేందుకు మీ మొబైల్ నెంబర్ UIDAI డేటాబేస్ లో నమోదు చేయబడాలి. మీ ఆధార్ అప్డేట్ హిస్టరీని చెక్ చేయడానికి మీరు ఈ కింద ఇచ్చిన స్టెప్స్ ఫాలో అయి తెలుసుకొండి. 👇👇
Click Aadhar Update History Link
Step 1 :: UIDAI వెబ్సైట్ ను ఓపెన్ చెయ్యాలి. UIDAI కి సంబందించిన MyAadhar portal నందు కూడా "Citizen యొక్క Mobile OTP login ద్వారా Aadhar Update History download" చేసుకోవచ్చు.
Step 2 :: Update Aadhar అనే మెను మీకు కనిపిస్తుంది. అక్కడ మీరు Aadhar Update History Option ను సెలెక్ట క్లిక్ చేయండి.
Step 3 :: అక్కడ మీకు సంబంధించిన ఆధార్ నెంబరు ను ఎంటర్ చేసి, క్యాప్చ ను కూడా టైప్ చేసి Send OTP నీ క్లిక్ చేయండి.
Step 4 :: మీ మొబైల్ కు ఓటిపి రావడం జరుగుతుంది. ఆ OTP ని ఎంటర్ చేసి సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయండి.
Step 5 :: చివరగా మీకు సంబంధించిన ఆధార్ లో ఏవైనా చేర్పులు, మార్పులు, Age, ఆలా ఏదైనా ఆధార్ లో change చేసి ఉంటే మీకు Aadhar Update History లో క్లియర్ గా కనబడుతోంది. దానిని మీరు PDF లో DOWNLOAD చేసుకోవచ్చును.
గమనిక :: పైన ఉన్న ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే మీ తోటి మిత్రులకు షేర్ చేయగలరు.