How to Check Aadhar and Bank Account Linking Status Online
మీ బ్యాంకు ఖాతాలలో ఏదైనా ఆధార్ తో లింక్ చేయబడిందా లేదా అని మీరు తనిఖీ చేయవచ్చు. మీరు ఆధార్ తో లింక్ చేయబడిన బ్యాంకు ఖాతాను కూడా కనుగొనవచ్చును. బ్యాంకు ఖాతా మరియు ఆధార్ లింక్ స్థితిని (Aadhar and Bank Account Linking Status) అయిందో లేదో తెలుసుకోవడానికి క్రింది స్టెప్స్ ఫాలో అయి తెలుసుకోండి.
Click Aadhar and Bank Account Linking Status (NPCI)
Online లో స్టేటస్ ఎలా తెలుసుకోవాలో తెలియకుంటే క్రింది లింక్ ని క్లిక్ చేసుకొని వీడియో రూపంలో తెలుసుకోండి.
Aadhar Bank Account Linking Status చెక్ చేయు విధానం (వీడియో రూపంలో)
Step 1 :: UIDAI వెబ్సైట్ ని సైట్ సందర్శించండి.(https://resident.uidai.gov.in/bank-mapper) మరియు "ఆధార్ / బ్యాంక్ లింకింగ్ స్థితిని తనిఖీ చేయండి" పై క్లిక్ చేయండి.
Step 2 :: మీరు బ్యాంక్ మ్యాపర్ పేజీకి వెళ్లడం జరుగుతుంది. అక్కడ మీరు UID/VID, కోడ్ ని నమోదు చేసి," OTP ని పంపు" పై క్లిక్ చేయాలి.
Step 3 :: UIDAI తో నమోదు చేసుకున్న మీ మొబైల్ నెంబర్ కు OTP పంపబడుతుంది. అందించిన స్థలంలో ఓటీపీని నమోదు చేసి " Submit " పై క్లిక్ చేయండి.
Step 4 :: ఆధార్ తో లింకు చేయబడిన బ్యాంకు ఖాతా స్క్రీన్ పై ప్రదర్శించబడుతుంది.
Step 5 :: ఫైనల్ గా మీ ఆధార్ కి ఏ బ్యాంక్ అకౌంట్ లింక్ అయిందో తెలుస్తుంది. అయితే మీరు ఒకే బ్యాంకులో రెండు బ్యాంకు ఖాతాలు కలిగి ఉంటే, లింకు చేయబడిన బ్యాంకు ఖాతా నెంబర్ ను నిర్ధారించడానికి మీరు బ్యాంకుని సంప్రదించాలి.
గమనిక :: ప్రభుత్వ సంక్షేమ పథకాలు పొందాలనుకుంటే కచ్చితంగా మీ బ్యాంక్ అకౌంట్ కి ఆధార్ కార్డు అనేది లింక్ అయి ఉండాలి. ఈ మధ్యనే మనకి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం మీ బ్యాంకు ఖాతా నీ ఆధార్ కార్డుకి లింక్ చేయడం తప్పనిసరి అని తేల్చి చెప్పడం జరిగింది.(alert-passed)
పైనున్న ఇన్ఫర్మేషన్ వచ్చినట్టయితే మీతోటి మిత్రులకు షేర్ చేయగలరు. 🙏 ధన్యవాదములు 🙏