YSR Sunna Vaddi scheme:
💥అన్నదాతలకు ఇచ్చిన వాగ్దానాలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిలబెట్టుకున్నారు. ఎన్నికల సందర్భంగా చేసిన నవ రత్నాల హామీల అమలులో భాగంగా.. ఆరు లక్షల మందికి పైగా రైతులకు వడ్డీ రాయితీ అందించామని సీఎం వైఎస్ జగన్ తెలిపారు. ఈ మేరకు సీఎం జగన్ మంగళవారం తన క్యాంపు కార్యాలయం నుంచి కంప్యూటర్ బటన్ నొక్కి రూ.128.47 కోట్లను రైతుల బ్యాంకు ఖాతాల్లో జమచేశారు. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందన్నారు. 2019 20 రబీ సీజన్‌లో లక్ష రూపాయల వరకు పంట రుణాలు తీసుకుని ఏడాదిలోపు తిరిగి చెల్లించిన 6,27,906 మంది రైతులకు ఏపీ ప్రభుత్వం వడ్డీ రాయితీ వారి ఖాతాలో జమ చేశారు.
వైఎస్సార్ సున్నా వడ్డీ - Beneficiary Status
S.N.O | SHG Names | Link |
---|---|---|
1 | SHG ఐడి లేదా Member ఐడి ద్వారా గ్రూప్ వివరాలు తెలుసుకునే లింక్ | Click |
2 | సున్నా వడ్డీ పథకం అర్హులైన SHG గ్రూప్ వివరాలు | Click |
NOTE : పైన ఉన్న లింక్స్ ఓపెన్ చేసుకొని మీ SHG పూర్తి వివరాలు తెలుసుకోండి.
💥 అర్హత ఈ పథకం ప్రయోజనాల కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాశ్వత నివాసి మాత్రమే పొందగలరు. దరఖాస్తుదారు స్వయం సహాయక బృంద సభ్యుడిగా ఉండాలి. దరఖాస్తుదారు తప్పనిసరిగా దిగువ దారిద్య్రరేఖకు చెందినవాడు, అది పేద స్వయం సహాయక సభ్యుడు మాత్రమే ఈ పథకానికి దరఖాస్తు చేసుకునే అవకాశం పొందుతుంది.
💥 వైఎస్సార్ సున్నా వడ్డీ రాయితీ పథకం ద్వారా ఇప్పటివరకు రైతులకు రూ.1,132.54 కోట్ల వడ్డీ రాయితీని ప్రభుత్వం అందజేసింది. రైతులు అప్పుల ఊబిలో చిక్కుకోకుండా వడ్డీలేని రుణాలు ఇస్తామని ఎన్నికల ముందు ఇచ్చిన మాట మేరకు.. సీఎం జగన్ వైఎస్సార్ సున్నా వడ్డీ పంట రుణాల పథకం అమలు చేస్తున్నారు. తొలుత ఈ క్రాప్‌లో నమోదు చేసుకున్న రైతులకు మాత్రమే సున్నా వడ్డీ పంట రుణాల పథకం వర్తింపజేయాలని నిర్ణయించారు. అయితే, ఈ క్రాప్‌లో 2,50,550 మంది రైతులు మాత్రమే నమోదు చేసుకున్నారు. మిగిలిన రైతులలో బ్యాంకర్లు అర్హులుగా గుర్తించిన వారందరికీ ఇప్పుడు సీఎం జగన్ ఉదారంగా ఈ పథకాన్ని వర్తింజేసి వడ్డీ రాయితీ చెల్లిస్తున్నారు.
Note:: పైన ఉన్న ఇన్ఫర్మేషన్ నచ్చినట్లు ఐతే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి.