💥 VAA/VHA/VSA ::
🙋🏻♂️రైతు భరోసా - UDP యాప్ నందు వచ్చు సమస్యలు - పరిస్కారాలు
1.వెబ్ ల్యాండ్ డేటా అందుబాటులో లేదు(Data not available) అని వస్తే....?
A.రైతు భరోసా-UDP యాప్ లో లోకి వెళ్లి Re-Submit data లో ఉన్న డేటా ని సబ్మిట్ చేసిన తరువాత యాప్ ఇన్ఫో లోకి వెళ్లి స్టోరేజ్ లో క్లియర్ డేటా చేసి తరవాత లాగిన్ అవ్వాలి.ఒక్కసారి లాగిన్ అయ్యిన తర్వాత "Sync data done" అని వచ్చేంత వరకు వేచి ఉండాలి.ఆ తర్వాత ల్యాండ్ ప్రొఫైల్ లో గ్రామం సెలెక్ట్ చేసుకుని ఖాతా నెంబర్ లేదా సర్వే నెంబర్ తో సెర్చ్ చేయవలయును.
2.E-KYC కావడం లేదు....?
A.ఒకేసారి అధిక మొత్తం యాప్ వినియోగదారులు సర్వర్ ను రిక్వెస్ట్ అడగడం వలన నెట్వర్క్ సమస్య వస్తుంది.ఇటువంటి సమస్యను మీరు తెలిపినట్టయితే మేము సర్వర్ ను కనెక్ట్ చేపిస్తాము.
3.క్రాప్ బుకింగ్ చేసిన తర్వాత డాష్ బోర్డ్(వెబ్ పోర్టల్) లో డేటా కనిపించడం లేదు....?
A.నాటిన తేదీ అక్టోబర్ 15 తర్వాత ఉంటే క్రాప్ బుకింగ్ చేసినవన్నీ డాష్ బోర్డ్ లో కనపడతాయి.అక్టోబర్ 15 కన్న ముందు తేదీ వేస్తే మీకు డాష్ బోర్డ్ లో కనిపించవు.
4.రైతు ఆధార్ EKYC పూర్తి అయ్యిందని ఎలా చూడాలి....?
A. వెబ్ లాగిన్ లో ఫార్మర్ రిపోర్ట్స్ లో ఫార్మర్స్ కి సంబంధించిన EKYC డీటెయిల్స్ ఉంటాయి.ఒక్కసారి EKYC పూర్తి అయిన రైతుకు మళ్ళీ EKYC అడుగుతుంటే ఈ సమస్యను టెక్నికల్ టీమ్ దగ్గరకు తీసుకుని వెళ్లవచ్చును.
5.Verify crop,Procurement,Shared with PPC స్టేటస్ చూడటం ఎలా?
A. వెబ్ లాగిన్ లో క్రాప్ బుకింగ్ జాబితాలో రైతుకు ఎదురుగా Crop verified/Procurement/Shared with PPC అని ఉంటుంది.దాని ప్రకారం మనం తెలుసుకోవచ్చు.
6.Exceptions లో డేటాని సబ్మిట్ చేయడం ఎలా?
A.(1)చాలా మంది VAA లు Exception ని ఓపెన్ చేసి రైతును సెలెక్ట్ చేసుకొని ల్యాండ్ ఎక్సటెంట్ ని క్లిక్ చేయకుండా అప్డేట్ చేస్తున్నారు.కావున అవి Exceptions లోనే ఉంటున్నాయి.
(2)రైతును సెలెక్ట్ చేసిన తర్వాత Select land Extent మీద క్లిక్ చేసి ఖాతా నెంబర్ ద్వారా గాని లేదా సర్వే నెంబర్ ద్వారా గాని సెలెక్ట్ చేసుకొని, విలేజ్ ని ఎంచుకుని ఆ రికార్డ్ కి సంబంధించిన సర్వే నెంబర్ ని సెలెక్ట్ చేసుకుని అప్డేట్ చేయవలయును.
7.రైతు భరోసా-UDP యాప్ లో ఫోటో తీస్తుంటే యాప్ బ్యాక్ వెళుతుంది?
A.(1) కెమెరా యాప్ లో క్లియర్ క్యాచ్ చేసిన తర్వాత చెక్ చేయడం.
(2)ఫోటో సైజ్ క్వాలిటీ తగ్గించుకోవడం వలన ఫోటో బ్యాక్ రాకుండా ఉంటుంది.
Note:: పైన ఉన్న ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే తప్పకుండా ఈ పేజీని ఫాలో అవ్వండి. అలాగే మీ తోటి మిత్రులు కూడా షేర్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ పేజీలో కామెంట్ చేయండి మీ కామెంట్ కి మళ్ళీ తిరిగి రిప్లై ఇవ్వ బడును.
🥰Share with your friends🥰