WhatsApp Group Join Now
Telegram Group Join Now

Rice కార్డు Eligibility | Ap Rice Card Full Detailes

bhadra
0



💥బియ్యం కార్డు💥


ప్రజా పంపిణీ వ్యవస్థలో పారదర్శకత, ఇంటి వద్దకే నాణ్యమై తో కూడిన నిత్యవసర సరుకులు అందజేయుడం.



 🙋అర్హతలు:-


  • కుటుంబ నెలసరి ఆదాయం గ్రామీణ ప్రాంతాలలో పదివేల లోపు పట్టణ ప్రాంతాలలో 12 వేల లోపు ఉన్న వారు అర్హులు.

  • సంబంధిత కుటుంబానికి మాగాని భూమి మూడు ఎకరాలు లేదా మెట్ట భూమి 10 ఎకరాలు లేదా రెండు కలిపి పది ఎకరాలు మించకూడదు.

  • కుటుంబం ప్రస్తుతం నివసిస్తున్న అటువంటి గృహం యొక్క నెలసరి విద్యుత్ వినియోగం బిల్లు 300 యూనిట్లు మించరాదు.

  • పట్టణ ప్రాంతాలలో పది వేల చదరపు అడుగుల స్థలం అంతకన్నా తక్కువ విస్తీర్ణంలో ఇల్లు ఉన్న వారే అర్హులు.

  • కుటుంబ సభ్యులలో ఎవరికీ నాలుగు చక్రాల వాహనం కలిగి ఉండరాదు. (టాక్సీ, ట్రాక్టర్, ఆటోలకు మినహాయింపు)

  • కుటుంబ సభ్యులలో ఆదాయపు పన్ను చెల్లింపుదారులు మరియు ప్రభుత్వ ఉద్యోగి లేదా ప్రభుత్వ పింఛన్ దారులు ఉన్నచో బియ్యం కార్డు పొందుటకు అనర్హులు(అన్ని శాఖలలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు మినహాయింపు)






💌కొత్త రైస్ కార్డ్ కి  apply చేయుటకు💌



  • కొత్త రైస్  కార్డు అప్లై చేయు వారు ఇంతకుముందు ఏ రేషన్ కార్డులో ఉండకూడదు.

  • కొత్త రైస్  కార్డ్ అప్లికేషన్ ఫారం

  • రైస్ కార్డు లో చేర్చాలి అనుకున్న కుటుంబ సభ్యులందరి ఆధార్ కార్డు జిరాక్స్

 

కొత్తగా పెళ్లైన మహిళలు చేర్చుటకు

 

  • రైస్ కార్డులు చేర్చుటకు అప్లికేషన్ ఫారం

  • ఆధార్ కార్డు జిరాక్స్

  • పెళ్ళైన మహిళ ఇంతకు ముందు ఉన్న తల్లిదండ్రుల రైస్ కార్డు నెంబర్

 

👶కొత్తగా జన్మించిన పిల్లలను చేర్చుట

 

  • Rice card చేర్చుటకు అప్లికేషన్ ఫారం

  • జన్మించిన పిల్లవాడి ఆధార్ కార్డు

  • జనన ధ్రువీకరణ పత్రం

  • తల్లిదండ్రుల రైస్ కార్డు జిరాక్స్

  • రైస్ కార్డ్ విభజన అప్లికేషన్ ఫారం

  • కుటుంబం నుంచి విభజన కావాలనుకున్న వారి ఆధార్ కార్డు జిరాక్స్

  • ప్రస్తుతం అందరూ కలిసి ఉన్నాఉన్న రైస్ కార్డు జిరాక్స్

 

🟥అప్లై చేయుటకు పైన తెలిపిన టువంటి వివరాలతో నేరుగా గ్రామ/వార్డు సచివాలయంలో గాని లేదా గ్రామ/వార్డు వాలంటీర్లుగా ని సంప్రదించవలెను.

 

అప్లై చేసిన వెంటనే అర్హులైన టువంటి దరఖాస్తుదారునికి యువర్ సర్వీస్ రిక్వెస్ట్ నెంబర్ను ఇవ్వడం జరుగుతుంది. 

 

దరఖాస్తు చేసిన పది రోజులలో అర్హులైన దరఖాస్తుదారునికి బియ్యం కార్డు కేటాయించబడుతుంది.

Post a Comment

0Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)