WhatsApp Group Join Now
Telegram Group Join Now

జగనన్న తోడు

bhadra
0

💌 జగనన్న తోడు పూర్తి ఇన్ఫర్మేషన్💌


🧾చిన్న వ్యాపారుల  మరియు సాంప్రదాయ వృత్తి దారులు వ్యాపారాభివృద్ధి కొరకు "జగనన్న తోడు" పధకం ద్వారా ఒక్కొక్కరికి రూ.10,000/ లోపు సున్నావడ్డీతో ప్రభుత్వం ఋణ సహాయము అందిస్తున్నది.

🧾ఈ పతాకం ద్వారా  చాలామంది చిన్న వ్యాపారుల కోసం ఈ పథకం ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తీసుకురావడం జరిగింది ఈ పథకం ద్వారా వ్యాపారులు అందరికీ 10,000 కతలో జమ అవ్వడం జరుగుతుంది.







చిరువ్యాపారులు అంటే ఎవరు?

🧾సాంప్రదాయ బద్ధమైన చేతి వృత్తులను జీవనాధారంగా జీవించే అల్పాదాయ వర్గ ప్రజలు. ఉదా: మగ్గం పని, లేస్ వర్క్స్, కుమ్మరి,కలంకారి, ఏటికొప్పాక బొమ్మలు, కొండపల్లి బొమ్మలు, తోలుబొమ్మలు, బొబ్బిలి వీణ,ఇత్తడి వస్తువుల తయారీ మొదలైనవి ఉత్పత్తి చేస్తూ స్వయంగా అమ్ముకునేవారు.

🧾 రోడ్డు ప్రక్కన, వీధులలో, బహిరంగ ప్రదేశాలలో, ఫుట్ పాత్ లపై మరియు ప్రైవేటు స్థలాలలో చిన్నచిన్న వ్యాపారాలు చేస్తూ జీవనం చేసుకునేవారు (చిరుతిళ్ళు, అంగళ్ళు, చెప్పులుకుట్టేవారు).

🧾సుమారు 5X5 అడుగుల స్థలంలో శాశ్వత లేదా తాత్కాలిక షాప్ లను ఏర్పాటు చేసుకుని వస్తువులు, సరుకులు తోపుడు బండ్లు లేదా తలమీద/ భుజంమీద, బుట్టలు/గంపలలో, వస్తువులు/సరుకులను మోస్తూ మరియు వీధులలో 
సరుకులు/వస్తువులు అమ్ముకునేవారు.

ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి సైకిల్, మోటార్ సైకిల్ మరియు చక్రాల బండి మీద వెళ్తూ సరుకులు వస్తువులు అమ్ముకునేవారు.

అర్హతలు:

🧾🥰18 సంవత్సరాలు నిండిన వారు.
🧾నెలవారీ ఆదాయం గ్రామీణ ప్రాంతాలలో నెలకు రూ. 10,000/- మరియు పట్టణ ప్రాంతాలలో అయితే రూ.12,000/ లోపు కలిగిన వారు. మాగాణి భూమి 3 ఎకరాలు లేదా మెట్ట భూమి 10 ఎకరాలు లేదా మాగాణి మరియు మెట్ట భూమి రెండు కలిపి 10 ఎకరాల లోపు ఉన్నవారు.
🧾 ప్రభుత్వం జారీ చేసిన గుర్తింపు కార్డులను ( ఆధార్ కార్డు, ఓటర్ కార్డు లేదా ఇతరములు) కలిగిన
వుండాలి.


దరఖాస్తు చేసుకొనే విధానము :



> అర్హత కలిగిన వారు వ్యాపార వివరాలు మరియు ప్రభుత్వ గుర్తింపు కార్డుతో పాటు స్వయంగా గ్రామ/వార్డు సచివాలయాలలో గాని లేదా గ్రామ/వార్డు వాలంటీర్ల ద్వారా గాని దరఖాస్తు చేసుకోవచ్చును.


> అర్హులైన దరఖాస్తుదారునికి YSR (Your Service Request - మీ సేవల అభ్యర్ధన) నెంబర్ ఇవ్వబడుతుంది.


> దరఖాస్తు చేసిన లబ్ధిదారులకు నిర్దేశించిన ప్రక్రియలు అన్ని పూర్తి చేసి అర్హత కలిగిన వారికి బ్యాంకుల ద్వారా సున్నావడ్డీతో రూ.10,000/- లోపు ఋణం ఇప్పించబడును.


> లబ్ధిదారులు బకాయి లేకుండా వడ్డీతో బ్యాంకునకు నెలసరి కంతులు / వాయిదాలు చెల్లించిన యెడల, ప్రభుత్వం 3 నెలలకు ఒకసారి వడ్డీని లబ్ధిదారుల ఖాతాలో జమచేస్తుంది



Post a Comment

0Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)