WhatsApp Group Join Now
Telegram Group Join Now

JVD FIVE STEP VERIFICATION FULL DETAILS

bhadra
0


💥JVD 5 స్టెప్ వెరిఫికేషన్ కు సంబంధించి ఇష్యూస్ & క్లారిఫికేషన్స్


 🟥How to finish Five Step Verification🟥


⭐ స్టూడెంట్ యొక్క తండ్రి or తల్లి గవర్నమెంట్ ఎంప్లాయ్, తల్లి మరియు స్టూడెంట్ మాత్రమే రైస్ కార్డు లో ఉంటున్నారు, తండ్రి సెపరేట్ గా వేరొక రైస్ కార్డ్ చేసుకున్నారు, ఇలాంటి స్టూడెంట్ ఎలిజిబుల్  అవుతారా?


💥NOT ELIGIBLE 💥

Note : స్టూడెంట్ యొక్క తల్లి - తండ్రి విడిపోయినట్టు ఏదన్నా ధ్రువీకరణ ఉంటేనే ELIGIBLE అవుతారు.


స్టూడెంట్ యొక్క ఫ్యామిలీలో సచివాలయం ఎంప్లాయ్ ఉంటే ఎలిజిబుల్  అవుతారా లేదా?


 🌹NOT ELIGIBLE🌹


⭐ 2020-21 స్టూడెంట్ ఇన్ ఎలిజిబుల్ అయ్యారు కారణం ఫ్యామిలీలో గ్రామ/వార్డ్ సచివాలయం ఎంప్లాయ్ ఉండటం వలన ఇప్పుడు వాళ్ళు వేరే రైస్ కార్డు తీసుకుని విడిపోయారు వీరు అర్హులవుతారా?


⭐మ్యారేజ్ అయ్యి విడిపోతేనే ELIGIBLE అవుతారు. సింగిల్ గా వేరే రైస్ కార్డు తీసుకుంటే NOT ELIGIBLE అవుతారు.


⭐కారు sale/Transfer/ Scarp చేసి రెండు సంవత్సరాలు కంప్లీట్ అయి ఉండాలి, అలా అయితే ELIGIBLE అవుతారు.


⭐ స్టేటస్ లో చూస్తే CET Eligibility no   అని ఉంటే సచివాలయం లో Five Step Verification  చేయాలా వద్దా?


💥CET Eligibility  no కి  Five Step Verification సంబంధం లేదు –  Five Step Verification  కంప్లీట్ చేయవలెను.


⭐ ఏ ప్రభత్వ ఉద్యోగి అయినా JVD కి NOT ELIGIBLE కానీ ఇతర ఉద్యగుల gross ఇన్కమ్  2.50 లక్షల కంటే ఎక్కువ ఉంటే  అనర్హులవుతారు.


🎓 జగనన్న విద్యా దీవెన: అర్హుల అనర్హుల విద్యార్థుల జాబితా విడుదల ::


👉 జగనన్న విద్యా దీవెన వసతి దీవెన కి సంబంధించి 2021-22 విద్యా సంవత్సరంలో చదువుతూ ఉన్నటువంటి విద్యార్థులు అందరికీ కూడా సచివాలయంలో ఫైవ్ స్టెప్ వెరిఫికేషన్ చేయడం జరిగింది. ఇలాంటి వాళ్లందరికీ కూడా ప్రస్తుతం అర్హుల మరియు అనర్హుల జాబితా అనేది రావడం జరిగింది.


👉 ఎవరైతే సచివాలయంలో డీటెయిల్స్ అన్ని ఇచ్చిన తర్వాత ఫైవ్ స్టెప్ వెరిఫికేషన్ జరిగిందో వారందరికీ సిస్టం ఆటోమేటిక్ గా జాబితా పంపించడం జరిగింది. 

 

👉 ఎవరైతే అనర్హత జాబితాలో ఉన్నారో ఆ విద్యార్థులు లేదా తల్లిదండ్రులు ఒకసారి జాబితా చూసుకొని ఎవరైతే ఆ లిస్ట్ లో వచ్చారో వాళ్లంతా కూడా సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ నిజంగా వఅర్హత ఉన్నట్లయితే ఆ డాక్యుమెంట్స్ ను సచివాలయంలో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.

 సచివాలయంలో వాళ్ళు వెరిఫై చేసిన తర్వాత ఎంపీడీవో/ మున్సిపల్ కమిషనర్ ఎవరైతే వాళ్ళు అప్ప్రొవె చేసిన తర్వాత పై లెవెల్ కి పంపిస్తారు.

అలాంటి వాళ్ళవి తర్వాత అర్హత ఉంటే అర్హుల జాబితాలోకి రావడం జరుగుతుంది.


👉 ఎవరైతే ఈ అనర్హుల జాబితాలో వచ్చారో వాళ్ళందరికీ కూడా తగిన కారణం చూపిస్తూ నోటీసులు జారీ చేయడం జరిగింది. ఒక కాపీ స్టూడెంట్ / స్టూడెంట్ తల్లి తండ్రిలకు కి అందజేయాల్సి ఉంటుంది. వాళ్ళు సంతకం పెట్టిన తర్వాత మరొక కాపీని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈ నోటీసులు అందుకున్న రెండు రోజుల్లో అప్లోడ్ చేయాలి. అంర్హుల జాబితాలో వచ్చిన వాళ్ళందరూ కూడా ఫిబ్రవరి 21 లోగా ఈ సంబంధించిన పత్రాలు సచివాలయంలో అందచేయాల్సి ఉంటుంది.


👉 ప్రస్తుతం ఉన్నటువంటి అర్హుల అనర్హుల జాబితాను ఫిబ్రవరి 11, 2022 వరకూ వెరిఫికేషన్ చేసినటువంటివి తీసుకోవడం జరిగింది. ఈ తర్వాత కూడా కాలేజీలో రిజిస్ట్రేషన్, సచివాలయంలో వెరిఫికేషన్ ప్రాసెస్ జరిగిన వాళ్ళందరికీ కూడా తర్వాత మరొక పది రోజుల్లోగా మరొక అర్హుల అనర్హుల జాబితా ను విడుదల చేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరూ ఆందోళనపడాల్సిన అవసరం లేదు.


👉 విద్యార్థి / కుటుంబ సంతకంతో కూడిన నోటీస్ ను రెండు రోజుల్లోగా అప్లోడ్ చేయాలి.


👉 ఫిబ్రవరి 21, 2022 లోపు నోటీసు లో ఉన్న కారణాన్ని అనుసరించి తగిన ఆధారాలతో సచివాలయం లో అందచేయాలి.


👉 కొంతమంది విద్యార్థులు కనీసం ఇంకా ఫైవ్ స్టెప్ వెరిఫికేషన్ కూడా చేయించుకోలేదు. అలాంటి వాళ్లందరికీ కూడా ఫైవ్ స్టెప్ వెరిఫికేషన్ హౌసెహోల్డ్ ఎక్కడ మ్యాప్ అయ్యిందో ఆ సచివాలయంలో చేయించుకోవాల్సి ఉంటుంది. అదే విధంగా కొంతమంది విద్యార్థులు వేరే సచివాలయం మ్యాప్ అయిపోవడం జరిగింది అలాంటి వాళ్లందరికీ ఇదివరకే పది రోజుల క్రితం రెండు సార్లు ఎస్ఎంఎస్ పంపించడం జరిగింది.


👉 ఈ ఫైవ్ స్టెప్ వెరిఫికేషన్ చేయించుకోని వారందరూ కూడా అనర్హుల జాబితాలోకి అయితే వెళ్లి పోవడం జరుగుతుంది ఈ సంవత్సరానికి అటువంటి విద్యార్థులు ఎవరికి కూడా కాలేజ్ ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్ అంటే జగనన్న విద్యా దీవెన వసతి దీవెన విడుదలకాదు అని గమనించాలి.


👉 వేరే సచివాలయంకు సంబంధించి విద్యార్థులు మరొక సచివాలయంలో మ్యాప్ అయినట్లయితే అలాంటివారు మా సచివాలయానికి సంబంధించిన వారు కాదు అని అప్డేట్ చేసే ఆప్షన్ కూడా ఇవ్వటం జరుగుతుంది.

NOTE :: ఫ్రెండ్స్ పైన ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే తప్పకుండా మీ తోటి మిత్రులకు షేర్  చేయగలరు.

Post a Comment

0Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)