Adhar Card Download in Telugu | How to Aadhar Card Download in Telugu
🟥 ఆధార్ అన్నది నిర్దేశిత తనిఖీ ప్రక్రియ సంతృప్తికరంగా ముగిసిన తర్వాత దేశవాసులకు UIDAI జారీచేసే 12 అంకెలతో కూడిన యాదృచ్ఛిక సంఖ్య. లింగభేదం, వయసు వంటివాటితో సంబంధం లేకుండా దేశవాసులు ఎవరైనా దీనికోసం స్వచ్ఛందంగా నమోదు చేసుకోవచ్చు. ఇందుకోసం ఎలాంటి రుసుము చెల్లించే అవసరం లేదు. అయితే, జనసంఖ్యసంబంధ, (డెమోగ్రాఫిక్) జీవసంబంధ (బయోమెట్రిక్) కనీస సమాచారాన్ని నమోదు సమయంలో అందజేయాలి. ఒక వ్యక్తి ఒకసారి మాత్రమే నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. వారి వివరాలు పునరావృత రహితమని రూఢి చేసుకున్న తర్వాత వాటి ఆధారంగా ఒకే ఒక విశిష్టమైన సంఖ్యను సృష్టిస్తారు. అందువల్ల జీవితకాలం చెల్లుబాటయ్యే వ్యక్తిగత గుర్తింపు సంఖ్య రూపొందుతుంది. దీన్ని ఆన్‌లైన్‌ద్వారా ఏ సమయంలోనైనా, ఎక్కడైనా వాస్తవ సమయంలో తిరుగులేనివిధంగా ప్రమాణీకరించవచ్చు.
🟥 ఆధార్ సంఖ్యలో నిఘా లేదా వ్యక్తిగత లేదా జాడ పసిగట్టే సమాచారం ఏదీ ఉండదు. ఇది వ్యక్తిగత గుర్తింపు కోసమే తప్ప పౌరసత్వ ధ్రువీకరణకు ఉపయోగించేది కాదు. దీనిద్వారా ఎలాంటి హక్కులు, లబ్ధికి హామీ లేదు. అయితే, ఆధార్‌ను శాశ్వత ఆర్థిక చిరునామాగా వాడుకోవచ్చు. తద్వారా సమాజంలోని అణగారిన, బలహీనవర్గాల ఆర్థిక సార్వజనీనత కోసం కల్పిస్తున్న లబ్ధిని పొందవచ్చు. అందువల్ల ఆధార్‌ను న్యాయ, సమానత్వ వితరణకు ఒక ఉపకరణంగా చెప్పవచ్చు..
సామాజిక, ఆర్థిక సార్వజనీనతకేగాక ప్రభుత్వరంగ సేవా సంస్కరణలు, ద్రవ్య అంచనాల (ఫిస్కల్ బడ్జెట్) నిర్వహణకు ఆధార్ ఒక వ్యూహాత్మక విధానోపకరణం. సౌలభ్యం మెరుగుదలకు, ఎలాంటి చిక్కులు లేని ప్రజా కేంద్రక పాలనకు ఉపయుక్త పరికరం. దేశంలోని ప్రతి వ్యక్తికీ విశిష్ట గుర్తింపు ఇస్తున్నందువల్ల ‘డిజిటల్ ఇండియా’ సౌధానికి ఆధార్ గుర్తింపు వేదిక ఒక కీలక మూలస్తంభం. ఆధార్ పథకం ఇప్పటికే ఎన్నో మైలురాళ్లను అధిగమించడమేకాదు... ప్రపంచంలోనే విశిష్ట జీవసంబంధ ఆధారిత గుర్తింపు వ్యవస్థగా గుర్తింపు పొందింది.
విశిష్టత, ప్రమాణీకరణ, ఆర్థిక చిరునామా, ఈ-కేవైసీ అన్నవి ఆధార్‌కు నాలుగు ప్రాథమిక లక్షణాలు. కాబట్టి కేవలం ఆధార్ సంఖ్య వినియోగం ద్వరా భారత ప్రభుత్వం ప్రతి నివాసినీ చేరగల సౌలభ్యం కల్పిస్తుంది. అదేవిధంగా మునుపెన్నడూ లేనిరీతిలో నివాసులు తమకు చెందాల్సిన వివిధ రాయితీలు, ప్రయోజనాలు, సేవలను అందుకునే మార్గం సుగమం అవుతుంది.
ఆధార్ నమోదు, విశిష్ట సంఖ్య సృష్టి గురించి మరింత తెలుసుకోవాలంటే ఈ వెబ్‌సైట్‌లోని ఆధార్ ఎన్రోల్మెంట్ అండ్ ఆధార్ జనరేషన్ విభాగం చూడండి.
Adhar Card Download in Telugu
Adhar Card Download Process :-
ADHAR DOWNLOAD LINK (large-bt)
Step1: పై లింక్ పై క్లిక్ చేయండి.🖕
Step2: తర్వత అ సైట్ లో డౌన్లోడ్ మీద క్లిక్ చెయ్యండి.
Step3: మీ ADHAR నెంబర్ ను ఎంటర్ చేయాలి.
Step4: వొటీపీ మీద క్లిక్ చెయ్యండి.
❗గమనిక: మీకు Otp ADHAR కీ లింక్ అయిన నంబర్ కి మత్రమే వస్తుంది.
Step5: otP ఎంటర్ చేసి డిటైల్స్ ఇవ్వలి.
Step6: తర్వత Download మీద క్లిక్ చెయ్యండి.
step7: pdf వస్తుంది దానిమీద క్లిక్ చేసి password ఎంటర్ చేయండి.
గమనిక: password మీ ADHAR card లో మొదటి నలుగు అక్షరాలు తో కలిపి, మి పుట్టిన సంవత్సరం ఎంటర్ చేయండి.(alert-passed)
Adhar Card Download in Telugu | How to Aadhar Card Download in Telugu
ఈ క్రింది లింకును క్లిక్ చేసుకొని వీడియో రూపంలో ఆధార్ కార్డు డౌన్లోడ్ ఎలా చేయాలి అనేది తెలుసుకోండి.
Note :- పైన ఉన్న వీడియో చూసి క్లియర్ గా ఏ విధంగా ఆధార్ కార్డు డౌన్లోడ్ చేయాలో తెలుసుకోండి.🖕
గమనిక : పైన ఉన్న ఇన్ఫర్మేషన్ నచ్చినట్లైతే మీ తోటి మిత్రులకు షేర్ చేయగలరు.(alert-passed)🖕
🎊🎊🎊
ReplyDelete