one time settlement scheme ap housing
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ ద్వారా ఇల్లు నిర్మించుకునే లబ్ది దారులు తమ ఇళ్లపై సర్వహక్కులు మరియు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా రిజిస్టర్ దస్తావేజు పొందుటకు జగనన్న కల్పిస్తున్న అవకాశమే "జగనన్న సంపూర్ణ గృహ పథకం". ( one time settlement scheme ) గృహ నిర్మామాణ సంస్థ వివిధ సంస్థల
నుంచి రుణాలు సేకరించి గృహాలు నిర్మించుకున్న లబ్ధిదారులకు అందజేస్తుంది. అట్టి ఋణమును తిరిగి వాయిదాల పద్ధతిలో లబ్ధిదారులు వడ్డీతో సహా చెల్లించవలసి ఉంటుంది. వడ్డీతో సహా బకాయి మొత్తము చెల్లించిన అప్పటికీ లబ్ధిదారులకు ఇంటి పై ఏ హక్కు పత్రం లభించేది కాదు. లబ్ధిదారుల సాధక బాధలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం నిర్ణయించిన అతి తక్కువ మొత్తం ను ఏకకాలంలో చెల్లించిన వారికి ఇంటి పై సర్వ హక్కులను కలగజేయాలని ఉద్దేశంతో జగనన్న ప్రభుత్వం ఈ పథకాన్ని అమలుచేయతలపెట్టింది. ఇందుకు అనుగుణంగా సంబంధిత చట్టాలను రాష్ట్ర ప్రభుత్వం సవరించింది.
one time settlement scheme ap government (విధి విధానాలు)
1 ) రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ ద్వారా రుణములు పొంది ఇళ్లు నిర్మించుకున్న లబ్ధిదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు.
2 ) ప్రభుత్వము నిర్ణయించిన ఏకమొత్తం కంటే, లబ్ధిదారుడు గృహనిర్మాణ సంస్థ ద్వారా పొందిన రుణము అసలు రుణము వడ్డీతో కలిపిన మొత్తము తక్కువ అయినచో ఆ మేరకు మాత్రమే చెల్లించవలెను.
3 ) రుణము పొందిన లబ్ధిదారుడు ( లేక ) ఇంటిని అనుభవిస్తున్న వారి వారసులు కూడా ఈ పథకం ద్వారా లబ్ధి పొందవచ్చును.
how to apply for settlement scheme
one time settlement scheme :- లబ్ధిదారులు ఇంటికి చెల్లించవలసిన మొత్తం వివరములు
1 ) గ్రామీణ ప్రాంతాలలో : రూ. 10,000 /-
2 ) పురపాలక సంఘం ప్రాంతములో : రూ. 15,000 /-
3 ) నగరపాలక సంస్థ ప్రాంతములు : రూ. 20,000 /-
🔻 ఈ పథకమునకు అర్హులైన లబ్ధిదారుల వివరాలు గ్రామ సచివాలయం లో అందుబాటులో ఉంటాయి. ఆసక్తి ఉన్న లబ్ధిదారులు సంబంధిత గ్రామ వార్డు సచివాలయంలో సంప్రదించవలెను.
🔻 ఈ పథకము కు సంబంధించి దరఖాస్తు చేయుట, స్థానిక విచారణ, నగదు చెల్లింపు మరియు రిజిస్టర్ దస్తావేజు జారీ తదితర సేవలన్నీ కూడా గ్రామ వార్డు సచివాలయంలో ద్వారా రెవిన్యూ ( lands ) రెవిన్యూ ( రిజిస్ట్రేషన్ ) , పంచాయతీ రాజ్, గృహ నిర్మాణ శాఖ నిర్వహిస్తాయి.
🔻 నిర్దేశించిన మొత్తమును చెల్లించిన వారికి రుణమాఫీ తో పాటు ఇంటి రిజిస్టర్ దస్తావేజులు డిసెంబర్ 21వ తేదీన అందజేయ బడతాయి.
🔻 లబ్ధిదారులకు ఎంతగానో మేలు చేసే ఈ పథకము ఈ సంవత్సరం డిసెంబర్ 21వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయబడుతుంది.
గమనిక :- one time settlement scheme ap government నాకు అర్హులైన లబ్ధిదారులకు అందరూ ఈ సదవకాశాన్ని ఉపయోగించుకొని గృహ నిర్మాణ సంస్థ నుంచి రుణ విముక్తులు తమ సొంత ఇంటి సంపూర్ణ హక్కును పొందవలసిందిగా ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తోంది.
Note :- ఫ్రెండ్స్ ఇంకా మీకు ఏమైనా నా నుంచి ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే మీరు ఈ పేజీ లో కామెంట్ చేస్తే నేను మీ కామెంట్ కి రిప్లై ఇస్తాను. అలాగే ముఖ్యంగా వాలంటీర్స్ కి మరియు సచివాలయం సిబ్బంది గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ అందించడం కోసం ఈ పేజీని అయితే క్రియేట్ చేశాను ఈ పేజి మీకు నచ్చినట్టయితే తప్పకుండా మీ తోటి మిత్రులకు షేర్ చేస్తారని కోరుకుంటూ కోరుకుంటున్నాను.